Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వారం రోజుల్లోనే 178 కోట్లు రాబట్టేసిన 'మెర్సల్'?

  • వసూళ్ల పరంగా దూసుకుపోతోన్న 'మెర్సల్'
  • మాస్ హీరోగా విజయ్ కి గల క్రేజ్ 
  • కలిసొచ్చిన వివాదం 
  • రేపు తెలుగు వెర్షన్ రిలీజ్      
తమిళనాట విజయ్ 'మెర్సల్' విజయవిహారం చేస్తోంది. విజయ్ మూడు విభిన్నమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలోను భారీ వసూళ్లను రాబడుతోంది. వారం రోజుల్లో ఒక్క తమిళ నాడులోనే ఈ సినిమా 50 కోట్ల షేర్ ను .. 87 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

 దేశవ్యాప్తంగా 63 కోట్ల షేర్ ను .. 117 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. అమెరికాలో 4.7 కోట్ల షేర్ ను 9.4 కోట్ల గ్రాస్ ను సాధించింది. మిగతా దేశాల్లో 26 కోట్ల షేర్ ను .. 52 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా 94 కోట్ల షేర్ ను .. 178 కోట్ల గ్రాస్ ను రాబట్టినట్టు చెబుతున్నారు. విజయ్ కి గల క్రేజ్ తో పాటు ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ పై చెలరేగిన వివాదం కలిసొచ్చి, ఈ స్థాయి వసూళ్లు సాధ్యమయ్యాయని చెబుతున్నారు. తెలుగులో 'అదిరింది' టైటిల్ తో రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.      
vijay
kajal

More Telugu News